ఎయిర్ ఇండియా వ‌న్ వ‌చ్చేసింది

హైద‌రాబాద్‌: ఎయిర్ ఇండియా వ‌న్ వ‌చ్చేసింది. అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌యాణించే ఎయిర్ ఫోర్స్ విమానం త‌ర‌హాలో.. భార‌త రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ప్ర‌యాణించే విమానం ఇవాళ ఢిల్లీ విమానాశ్ర‌యంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ల్యాండ్ అయ్యింది. అమెరికాలోని డ‌ల్లాస్‌లో త‌యారైన ఈ విమానం ఇండియాకు చేరుకోవ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ వ‌న్ త‌ర‌హాలో ఉండే ఈ విమానంలో అడ్వాన్స్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ఉన్న‌ది. ఆకాశంలో వెళ్తున్న స‌మ‌యంలో ఈ విమానం నుంచి ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్ చేయ‌వ‌చ్చు. అది కూడా హ్యాకింగ్ జ‌ర‌కుండా చూడ‌వ‌చ్చు.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టులోనే అమెరికా అప్పగించాల్సి ఉంది. అయితే… కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. ఒక‌సారి రీఫ్యుయ‌లింగ్ చేస్తే అప్పుడు ఎయిర్ ఇండియా వ‌న్‌.. అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు ఎక్క‌డా బ్రేక్ లేకుండా రాగ‌ల‌దు. రెండు వీఐపీ సూప‌ర్ ప్లేన్ల‌ను ఎయిర్‌ఫోర్స్ ద‌ళాలు ఆప‌రేట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా అధ్య‌క్షులు వాడే ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం.. దాదాపు 1013 కిలోమీట‌ర్ల వేగంతో సుమారు 35వేల ఫీట్ల ఎత్తులో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే ఇదే త‌ర‌హాలో ఎయిర్ ఇండియా వ‌న్ విమానం కూడా గంట‌కు 900 కిలోమీట‌ర్ల వేగంతో ఏక‌ధాటిగా 17 గంట‌లు ప్ర‌యాణించ‌నున్న‌ది. వైమానిక ద‌ళానికి చెందిన పైల‌ట్లు.. ఎయిర్ ఇండియా వ‌న్ విమానాన్ని ఆప‌రేట్ చేయ‌నున్నారు. కాగా రెండు విమానాల ఖ‌ర్చు సుమారు 8458 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.