ఎర్ర‌కోట‌పై మువ్వ‌న్నెల జెండాకు అవ‌మానం: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: జ‌న‌వ‌రి 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాకు జెండాకు అవ‌మానం జ‌రిగింద‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ అన్నారు. మ‌న్ కీ బాత్ లో భాగంగా ఆదివారం ఉద‌యం ఆలిండియా రేడియోలో ప్ర‌సంగించిన ప్ర‌ధాని ప‌లు అంశాల‌ను ప్ర‌స్థావించారు. వాటిలో ముఖ్య‌మంగా ఆస్ట్రేలియాలో భార‌త క్రికెట్ జ‌ట్టు టెస్టు సిరీస్ గెలువ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఔష‌ధాలు, టీకాల విష‌యంలో భార‌త్ స్వావలంబ‌న సాధించింద‌ని, అందుకే వ్యాక్సినేష‌న్‌లో పొర‌గు దేశాల‌కు కూడా స‌హాయం చేయ‌గ‌లుతున్నామ‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. పండుగ‌లు, ఉత్స‌వాలు, గ‌ణ‌తంత్ర వేడుక‌లు, బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం వంటి కార్య‌క్ర‌మాల‌తో జ‌న‌వ‌రి నెల వేగంగా గ‌డిచిపోయింద‌న్నారు. అలాగే ప‌ద్మ‌పురస్కారాల‌కు ఎంపికైన వారికి ఈ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.