ఏపీలో కొత్తగా 10,392 కరోనా కేసులు

అమరావతి : ఎపిలో కరోనా జోరు కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 60,804 పరీక్షలు చేయగా, 10,392 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 4,125 కి చేరింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు 38 లక్షలు దాటాయి. ఇప్పటివరకూ 38,43,550 టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
మంగళవారం కరోనా నుంచి 8,454 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 3,48,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,03,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వల్ల నిన్న నెల్లూరులో 11 మంది, చిత్తూరులో 10 మంది, పశ్చిమ గోదావరిలో 9, ప్రకాశంలో 8, కృష్ణాలో 6, విశాఖపట్నంలో 6, అనంతపూర్‌లో 4, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 3, కడపలో 2, కర్నూలులో 1 మరణించారు.