ఏపీలో కొత్తగా 6923 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 6923 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్రవైద్యారోగ్యశాఖ తెలిపింది. తాజాగా మరో 45 మంది కరోనాతో చనిపోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 675674కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64876 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 605090 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5708కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,796 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 56,00,202 శాంపిల్స్ పరీక్షించారు.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మరణాలు… ప్రకాశం 8, కృష్ణా 6, గుంటూరు 5, తూర్పుగోదావరి, 4, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కొవిడతో మరణించిన వారి సంఖ్య 5708 కి చేరింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5600202 నమూనాలను పరీక్షించారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,006, పశ్చిమగోదావరి జిల్లాలో 929, ప్రకాశం 659 కరోనా కేసులు నమోదయ్యాయి.