ఏపీలో 6 ల‌క్ష‌లు దాటిన ‌క‌రోనా కేసులు

ఒక్కరోజే 10,712 మంది డిశ్చార్జ్‌

అమరావతి : ఆంధ్ర‌ప‌దేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,712 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,08,088కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,84,371 టెస్టులు పూర్తయ్యాయి.

కాగా తాజాగా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6 ల‌క్ష‌లు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 77,492 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,702 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కు చేరింది. గత 24 గంటల్లో 72 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,177కి చేరింది. ప్రస్తుతం 88,197 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనా బారిన‌ప‌డి మృతి చెందిన‌వారిలో అత్య‌ధికంగా చిత్తూరులో 12 మంది, ప్ర‌కాశం జిల్లాలో 10, క‌డ‌ప‌లో 6, గుంటూరు, క‌ర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు, తూర్పుగోదావ‌రి,కృష్ణా జిల్లాల్లో ఐదుగురు, అనంత‌పురం, విశాఖ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో న‌లుగురు, శ్రీకాకుళంలో ఇద్ద‌రు, విజ‌య‌న‌గ‌రంలో ఒక‌రు చ‌నిపోయారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.