ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ రెండోసారి కొనసాగనున్నారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసిని నియమించారు. ఈమేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీని, మరో 25 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 31 మందితో తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో తెలంగాణా టీడీపీ సమన్వయ కమిటీని నియమించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులుః నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావును నియమించారు.
పొలిట్ బ్యూరోః యనమల, అశోక్‌గజపతిరాజు, అయ్యన్న, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పొలిట్ బ్యూరో సభ్యులుగా బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా కొనసాగుతున్నారు.
జాతీయ టీడీపీ అధికార ప్రతినిధులుః దీపక్‌రెడ్డి, పట్టాభి రామ్, నసీర్, ప్రేమ్‌కుమార్, జోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, అశోక్‌బాబు నియమితులు కాగా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బచ్చుల అర్జునుడు, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా మునిరత్నం, జి.నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. కోశాధికారిగా శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నియమితులయ్యారు.