ఏలూరులో ఏం జ‌రుగుతోంది?

ఏలూరు : ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కోవిడ్ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ ప్ర‌యోగాలు చివ‌రిద‌శ‌కు చేరుకున్నాయి. ఈ గుడ్‌న్యూస్‌తో ప్ర‌జ‌లంతా ఊప‌రి పీల్చుకుంటున్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నగరంలో ఓ వింత వ్యాధి అందరినీ కలవరానికి గురి చేస్తోంది. అక్క‌డ ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డంలేదు. ఎందుకు ప్ర‌జ‌లు సొమ్మ‌సిల్లి ప‌డిపోతున్నారో.. అర్థం కానీ ప‌రిస్థితినెల‌కొంది. ఏలూరు వాసులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గ‌త కొన్ని రోజులుగా అక్క‌డి ప్ర‌జ‌లు నోట్లో నురగలు కక్కుతూ, వాంతులు,కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో ఏలూరు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.

వింత వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి నుండి సేకరించిన రక్తంతో పలు పరీక్షలు చేసినప్పటికీ.. స్కాన్ చేసినా కూడా వైద్య నిపుణులు దీనికి గల కారణామేంటో ఇంకా స్పష్టం చేయలేకపోయారు. ఈ పరిస్థితి ఎందుకని తలెత్తిందో వారు కూడా చెప్పలేకపోతున్నారు.

మరోవైపు ఏలూరుకు వెళ్లిన ప్రత్యేక డాక్టర్ల టీమ్ ఈ అంతు చిక్కని వ్యాధికి వాయు కాలుష్యం మాత్రం కారణం కాదని స్పష్టం చేసింది. దీని కోసం నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు.

రోగుల‌నుంచి సేక‌రించిన న‌మూనాల్లో భార‌లోహ‌ల అవ‌శేషాల‌ను ప్రాథ‌మికంగా గుర్తించిన‌ట్లు ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIMS) వైద్యులు, ఢిల్లీ నిపుణులు చెబుతున్నారు. దీని గురించి అధ్యయనం చేసేందుకు డాక్టర్ల టీమ్ మంగళగిరి నుండి ఏలూరుకు బయలుదేరింది.

అయితే ముందుగా ఈ రోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ వ్యాధి నుండి చాలా మంది వేగంగానే కోలుకుంటున్నారు.

ఏలూరుకు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి బృందం

 

Leave A Reply

Your email address will not be published.