ఒక్కరు కాదు.. వందమంది రజనీలు!

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయరంగ ప‍్రవేశం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఈ పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా జరుకుంటున్నారు. సూపర్ స్టార్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. శనివారం పదుల సంఖ్యలో అభిమానులు రజనీ వేషధారణలో పోయస్ గార్డెన్‌లోని ఆయన ఇంటిముందుకు చేరి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రోబో, భాషా, నరసింహ ఇలా హిట్ సినిమాలలోని రజనీ వేషాలను వారు ధరించారు. కొందరు పోస్టర్లు పట్టుకుని తమదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, డిసెంబర్ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు తలైవర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.