కన్నుమూసిన ఘంటసాల కుమారుడు

చెన్నై(CLiC2NEWS): సుప్ర‌సిద్ధ గాయ‌కుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు ర‌త్న‌కుమార్ డ‌బ్బిండ్ ఆర్టిస్ట్‌గా త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయ‌న చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందు ఆయనకు కరోనా సోకి రిక‌వ‌రీ అయ్యారు. 2 రోజుల కింద‌టే క‌రోనా నెగిటివ్‌ వచ్చింది.

రత్నకుమార్‌ ఆకస్మిక మరణంతో ఘంటసాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఘంటసాల, సావిత్రి దంపతుల రెండ‌వ‌ కుమారుడే రత్నకుమార్‌. ఈయన ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. రత్నకుమార్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.