కరోనా: కొత్తగా 3 లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు

న్యూఢిల్లీ: మ‌ళ్లీ క‌రోనా డేంజ‌ర్ బెల్ మోగిస్తోంది. తాజాగా కొత్త మూడు లక్షలణాలతో కరోనా సెకండ్‌ వేవ్‌ భారతదేశాన్ని తాకింది. సెకండ్‌ వేవ్‌లో ఇన్ఫెక్షన్లు, కేసులు పెరుగుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం చేస్తున్నాయి. వచ్చే నాలుగు వారాలు క్లిష్టమైనవి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇప్పటివరకు కొవిడ్‌-19 సాధారణ లక్షణాలు జ్వరం, శరీర నొప్పులు, వాసన, రుచిని కోల్పోవడం, చలిగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపించేవి.

కొత్త ల‌క్ష‌ణాలు…

వైరస్‌ వ్యాపించిన వారిలో కొత్తగా గులాబీ కళ్ళు, గ్యాస్ట్రోనమికల్ పరిస్థితులు, వినికిడి లోపం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.

గులాబీ క‌ళ్లు.. చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, పింక్ ఐస్‌ లేదా కండ్లకలక అనేది కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌కు సంకేతం. పింక్‌ ఐస్‌ వచ్చినప్పుడు కంటిలో ఎరుపు, వాపు కనిపిస్తుంది. కన్ను అంతా నీరుగా మారుతుంది. కరోనావైరస్ కొత్త జాతి బారిన పడిన 12 మందిలో ఈ లక్షణాలను పరిశోధకులు గుర్తించారు.

వినికిడి నష్టం.. ఈ మధ్యకాలంలో రింగింగ్ ధ్వని లేదా ఒకరకమైన వినికిడి లోపాన్ని గమనించినట్లయితే.. అది కరోనా వైరస్‌ సోకినట్లు సంకేతం కావచ్చని గుర్తించాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ వినికిడి సమస్యలకు దారితీస్తుంది.

గ్యాస్ట్రోఇంటెస్టైనల్‌ లక్షణాలు.. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. అతిసారం, వాంతులు, ఉదరంలో తిమ్మిరి, వికారం, నొప్పి కరోనావైరస్ సంకేతాలు. మీరు ఏదైనా జీర్ణ అసౌకర్యాన్ని ఎదుర్కొంటుంటే.. అది కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌గా భావించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.