టి.వేదాంత సూరి: కరోనా క్యా కరోనా..
టి.వేదాంత సూరి: కరోనా క్యా కరోనా..
అవును ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఒక పండుటాకులా విల విలలాడుతుంది. ఎలా పుట్టింది, కారకులెవరు.. అనే ప్రశ్నలను పక్కన పెడితే.. ఇప్పుడు కరోనా బారిన పడకుండా. ఎలా కాపాడుకోవాలి? ఒక వేళ వచ్చినా ఎలా మనలను మనం ఎలా రక్షించు కోవాలి? ధైర్యాన్ని ఎలా పొందాలి.. అనే ప్రశ్నలతో మానవులంతా సతమతమవుతున్నారు.. ఆహార అలవాట్లు, జీవన సరళిలో మార్పులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది శుభ పరిణామమే.. ముఖ్యముగా భారతీయుల ఆహారపు అలవాట్లు కరోనా నుంచి కాపాడుకోవడానికి ఉపయోగ పడుతున్నాయి. పసుపు, వాము, జిలకర, మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, వేడి నీటితో ఆవిరి పట్టడం, యోగ, ప్రాణా యామం చేయడం, బలవర్ధక ఆహారం తీసుకోవడంతో చాలా వరకు జబ్బు బారినుంచి బయట పడుతున్నారు.. ఇవన్నీ ఇంటిలోనే చేసుకుంటున్నారు. ఇక మరో వైపు ప్రభుత్వ ఆసుపత్రులలో తగిన సిబ్బంది లేకపోవడం, ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేసే డబ్బు లేకపోవడంతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు వదులుతున్నారు.. మన దేశంలో లాగే చైనాలో కూడా ఆవిరి పట్టడం, స్థానిక వైద్యం చేసుకుంటూ కోలుకుంటున్నారు.. దీని ఫలితంగా ప్రపంచ మానవాళి తీవ్ర నష్టాన్ని చవి చూస్తుంది. ఆర్ధిక సంక్షోభం దిశగా దేశాలు పరుగులు తీస్తున్నాయి.. పిల్లల చదువులు కుంటుపడ్డాయి. అభివృద్ధిలో వెనుక పడవలసిన పరిస్థితి… మళ్ళీ ప్రపంచం ఎప్పుడు కోలుకుని యధా పరిస్థితులు నెలకొంటాయి అన్నది ఒక భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక వైపు మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. మరో వైపు సాధారణ ప్రజల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. ఎంత త్వరగా మందు వస్తే అంత మంచిది. ఈ నేపధ్యంలో వివిధ దేశాలు, కంపెనీలు పోటీ పది మందులు తయారు చేసే పనిలో పడ్డాయి. అవి, ఎంతటి నిజాయితీవో, నకిలీవో తెలియదు.. అదికూడా ఒక సమస్య.. ఈ వైరస్ ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవలసిన అత్యవసర ప్రశ్నలకు సమాధానాలు కూడా రాబట్టుకోవాలి. వైద్యులకు, నాయకులకు, వ్యాపారులకు, అధికారులకు, సగటు మనిషికి ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్న కరోనాకు ఎవరు ఏ సమాధానము చెబుతారు. ఎవరు కరోనా మెడలు వంచుతారు. మానవులకు రక్షణగా ఉంటారో కాలమే నిర్ణయిస్తుంది.. ఆ శుభ తరుణం త్వరలో రావాలని ఆకాంక్షిద్దాం.