కాంగోలో బంగారు గని కూలి 50 మంది మృతి

కాంగో : కాంగోలో ఒక బంగారు గని కూలి 50 మంది మరణించారు. ఈ ఘటన తూర్పున ఉన్న కమితుగ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగినట్లు ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. భారీ వర్షాల కారణంగా గని కూలిపోయిందని ఇన్షియేటివ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సోషల్ సూపర్‌విజన్ వుమెన్ అధ్యక్షులు ఎమిలియాన్ ఇటోంగ్వో తెలిపారు. కాంగోలో బంగారం తవ్వకాలు జరిపేందుకు కెనడా మైనింగ్ కంపెనీ బన్రో కార్పోరేషన్ అనుమతి ఉండాలని, అయితే ఈ గని దాని పరిధిలో లేదని అన్నారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా క్షతగాత్రులను వెలికితీసే కార్యక్రమం బారీ ఎత్తున చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు తెలియజేస్తామన్నారు.