కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న సీనియర్ నేతలు…
హైదరాబాద్:గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవికుమార్ పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌రెడ్డి ఇతర సినియర్ నేతలు భిక్షపతి యాదవ్ నివాసానికి చేరుకుని పార్టీని వీడొద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. భిక్షపతి యాదవ్‌తో చర్చలు విఫలం కావడంతో కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు. కాగా భిక్షపతి యాదవ్ ఆయన కుమారు బిజెపిలో చేరే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిజెపిలో చేరనున్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గోదావరి, అంజిరెడ్డి రెడీ అవుతున్నారు. అంజిరెడ్డి దంపతులకు నిన్న రాత్రి బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో ఇవాళ సాయంత్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. అంజిరెడ్డి ఇంటికి వెళుతున్నారు.