కాజల్ పెళ్లికి డేట్ ఫిక్స్

ముంబయి : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవు
డ్‌లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ఓ ఇమేజ్‌ను దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ పెళ్లికి నేను ఎస్ చెప్పానని, గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు, అక్టోబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించింది.
ముంబైలో వివాహం జరగనుందని, పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిపింది. పాండమిక్ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లు మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను” అన్నారు కాజల్.
కాగా కాజల్‌కు కాబోయే భర్త గౌతమ్ కిచ్లు ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్త. ఫాబ్ ఫర్నిష్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన గౌతమ్ ‘ది ఎలిఫెంట్’ అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ కంపెనీకి సీఈఓగా కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘డిస్కెర్న్ లివింగ్’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020
(తప్పక చదవండిః కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోయేది ఇతగాడినే..?)