కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకోబోయేది ఇతగాడినే..?

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ కాజ‌ల్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. కొంత‌కాలంగా ఆమె పెళ్లికి సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తి ముంబైకి చెంద‌ని ఇంటిరీయ‌ర్ డిజైన‌ర్ అని తెలుస్తోంది. తాజాగా కాజల్‌ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది.


ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ వివాహం చేసుకోనుందని, ఇప్పటికే అతనితో నిశ్చితార్థం కూడా పూర్తయిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంతకు ముందు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా అయితే కామ్‌గా ఉందో.. ఇప్పుడు కూడా కాజల్‌ సైలెంట్‌గానే ఉండటం విశేషం. కాజ‌ల్ ప్ర‌స్తుతం భార‌తీయుడు-2లో క‌మ‌ల్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఇటు చిరంజీవితో కూడా కాజ‌ల్ హీరోయిన్ గా ఓ సినిమా చేస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.