కార్డియాక్ అరెస్టుతో కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి
![](https://clic2news.com/wp-content/themes/publisher/images/default-thumb/publisher-lg.png)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరానికి చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ కెనడాలోని ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటి మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అహ్మద్ శుక్రవారం కార్డియాక్ అరెస్టు తో మృతి చెందినట్లు సమాచారం. అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు మృతిపై కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కుటుంబసభ్యులు కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు.