కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 15మంది మృతి
పుణె (CLiC2NEWS): మహారాష్ట్రలోని పుణెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారు చేసే ఒక రసాయన పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ఇంకా కొందరు కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 20 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాపాడారు. 6 అగ్నిమాపక వాహణాలు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
