కొత్తగా 2,384 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 4వేల 249కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 755కు పెరిగింది. కాగా కొత్తగా 1851 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్నారి సంఖ్య 80,586గా నమోదైంది.
తెలంగాణలో రికవరీలు శనివారం కొత్తగా 1851 వచ్చాయి. మొత్తం రికవరీల సంఖ్య 80586గా ఉంది. అందువల్ల యాక్టివ్ కేసులు 22908 ఉన్నాయి. వాటిలో 16379 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
నిన్న తెలంగాణ ప్రభుత్వం 40666 టెస్టులు చేయించింది. మొత్తం టెస్టుల సంఖ్య 931839కి చేరింది. 1347 రిపోర్టులు రావాల్సి ఉందట.
రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో హోమ్ ఐససోలేషన్లో ఉన్న వారి సంఖ్య 16,387గా ఉంది. ఇక కేసుల విషయానికి వస్తే.. జీహెచ్ఎంసీ-472, జగిత్యాల-105, ఖమ్మం-105, కరీంనగర్- 125, నల్గొండ-137, నిజామాబాద్-148, రంగారెడ్డి-131, సూర్యాపేట – 110గా ఉన్నాయి.