కోవిడ్‌ రోగులకు ఉచిత ఆటో ప్రయాణం

సిలిగురి(ప‌శ్చిమ బెంగాల్‌): మ‌న వీధిలో ఎవ‌రో ఒక‌రికి క‌రోనా వ‌చ్చిందంటే.. చాలూ నానా హైరానా ప‌డ్తాము. లెక్క‌లేన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకంటాము.. అలాంటిది కొంత‌మంది కోవిడ్‌ కష్టాల కాలంలో ఒక్కొక్కరు ఒక్కోలా తోటివారికి సహాయం చేస్తూ వారి గొప్ప‌మ‌నసును చాటుకుంటున్నారు. ఆ కోవ‌లోకే వ‌స్తుంది. మున్మున్ స‌ర్కార్‌. ఈమె పశ్చిమ బెంగాల్‌ సిలిగురి నగరానికి చెందిన మ‌హిళ‌. గ‌త కొంత కాలం నుంచి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. ప్రతి నెలా ఆటోమీద వచ్చే ఆదాయంతోనే కుటుంబం నడుపుతుంది. తన చుట్టూ ఉన్న జనం కోవిడ్‌-19 రోగులు, వారి కుటుంబాల పట్ల చిన్నచూపును తనకు ఎంతో బాధ కలిగించింది. వారికి తనకు చేతనైన సహాయం చేయాలని అనుకొంది. ‘కరోనా రోగులకు ఉచిత ప్రయాణం’ అనే స్టిక్కర్‌ను ఆటోకు అంటించింది. ఉచితంగా రోగుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌వ‌ద్ద‌ని.. దాని మూలంగా ఆటో డ్రైవ‌ర్ల ఆదాయానికి గండిప‌డుతుంద‌ని వారు వారించినా.. స‌ర్కార్ ఆమె మాట‌ల‌ను లెక్క‌చేయ‌కుండా ముందుకు దూసుకెళ్తుంది. పైగా ఒక చిన్న ఫోన్ కాల్ వ‌స్తే చాలు ఆటో గుమ్మం ముందు ఉంటుంది. దానికి ఈ టైం అంటూ ఏమి లేదు. ఎనీటైం.. ఆటో రెడీ అంటుంది స‌ర్కార్‌. క‌రోనా రోగుల‌కు ఇంత సేవ చేస్తున్న ఈమె ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది అని మ‌న‌కు అనుమానం రావ‌చ్చు.. అవునండీ మున్మున్ స‌ర్కార్ కూడా ఉద‌యాన్నే ఆటోను శానిటైజర్‌ చేస్తుంది. పిపిఇ కిట్‌ను ధరించి ఆటో నడుపుతుంది. ప్రయాణికులు టెంపరేచర్‌ చేశాకనే ఆటో ఎక్కనిస్తుంది. ఇప్పటివరకూ తన ఆటోలో 100 మందికి పైగా రోగులను, వైరస్‌ నుంచి కోలుకున్న వారిని ఉచితంగా ఇంటికి చేర్చింది. చేర్చ‌డ‌మే కాకుండా వారిని ఇంట్లోనే ఉండమని చెప్పిన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉచితంగా ఇంటికి చేర్చింది. అలాగే కుటుంబ సభ్యులకు కోవిడ్‌ రిస్క్‌ ఉండకూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఒక చిన్న గదిలో ఉంటుంది. తనకు సంబంధించిన బట్టలు, వస్తువులు విడిగా పెట్టుకుంది. తన భర్త ఆనంద్‌ మద్దతుతోనే ఈ పని చేయగలుగుతున్నానని మున్మున్‌ తెలిపింది. ఏది ఏమైనా ఈ బెంగాల్ కు చెందిన మున్మున్ స‌ర్కార్ మ‌నంద‌రికీ ఆద‌ర్శం… అందుకే `శ‌భాష్‌! స‌ర్కార్‌` అనాల్సిందే.. మ‌రి .. మీరు కాదంటారా?

Leave A Reply

Your email address will not be published.