క్యాన్సర్‌ను జయించిన సంజయ్‌దత్‌

ముంబయి: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేన్సర్‌పై విజయం సాధించారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న సంజయ్ పూర్తి ఆరోగ్య వంతుడిగా మారారు. ఈ మేరకు సంజూ భాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. `మీ అందరితో ఈ వార్త పంచుకుంటుంటే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోతోంద`ని సంజయ్ కామెంట్ చేశారు

క్యాన్సర్‌ రహితంగా బయటపడినట్లు వచ్చిన వార్తను ఈ రోజు మీ అందరితో పంచుకున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది. గత కొన్ని వారాలు తనకు, తన కుటుంబానికి చాలా కష్టంగా గడిచాయని తన నోట్‌లో వెల్లడించారు. దేవుడు తన బలమైన సైనికులకు కష్టతరమైన యుద్ధాలను ఇస్తాడని.. ఈ రోజు నా పిల్లల పుట్టినరోజు సందర్భంగా ఈ యుద్ధం నుండి విజయం సాధించి బయటపడటం ఎంతో సంతోషకరంగా ఉన్నది అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మీ అందరి మద్దతు, ఆశీర్వాదం లేకపోతే ఇది జరిగేది కాదు. ఇలాంటి కష్టకాలంలో నాకు మద్దతుగా నిలిచిన నా ఫ్యామిలీకి, అభిమానులకు రుణపడి ఉంటాను. కోకిలాబెన్ హాస్పిటల్‌ డా. సేవంతి, ఆమె వైద్య బృందానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాన`ని సంజయ్ పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.