కనీస వేతనం రూ.19 వేలు ఉండాలి!
ఫిట్మెంట్ 7.5%: తెలంగాణ పీఆర్సీ కమిషన్ రిపోర్టు విడుదల
హైదరాబాద్: పీఆర్సీ (తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం) రిపోర్టు బుధవారం విడుదలైంది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తేన సవరణ సంఘం(పిఆర్సి) సిఫార్సు చేసింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని, గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు.. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది.
సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్‌లతో గల త్రిసభ్య కమిటీ చర్చలు నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు టీజీవో, టీఎన్జీవో సంఘాలతో చర్చలు జరపనుంది.
పిఆర్సీ చేసిన సిఫార్సులు
- మూల వేనంపై 75 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పిఆర్సీ సిఫార్సు..
- ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని ప్రతిపాదన
- గరిష్ట వేతనం రూ. 1,62,070 వరకూ ఉండొచ్చని సిఫార్సు
- ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 యేళ్లకు పెంచాలని సిఫార్సు
- హెచ్ ఆర్ ఎ తగ్గిస్తూ సిఫార్సు
- గ్రాట్యూటీ పిరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంపు
- శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు
- సిపిఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలి
- 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలుకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు.
[…] కనీస వేతనం రూ.19 వేలు ఉండాలి! […]