చిరంజీవికి క‌రోనా నెగెటివ్‌

హైద‌రాబాద్: చిరు అభిమానుల‌కు శుభ‌వార్త‌.. ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన మెగ‌స్టార్ చిరంజీవి కోలుకున్నారు. తాజాగా ఆయ‌కు జ‌రిపిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్ రిపోర్టు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. గ‌త నాలుగు రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా వ‌చ్చిన‌ట్టు తేలినా ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. దీంతో అనుమానం వ‌చ్చి అపోలో వైద్యుల బృందాన్ని సంప్రదించానని చిరంజీవి తెలిపారు. సీటీ స్కాన్‌లో నెగిటివ్‌ వచ్చిందనీ, చివరికి తనకు పాజిటివ్‌ వచ్చిన కేంద్రంలో పరీక్ష చేయించినా కూడా నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని ట్వీట్‌ చేశారు. ఈ మూడు రిపోర్టుల తరువాత వైద్యులు తనకు కరోనా సోకలేదని నిర్ధారించారంటూ అభిమానులకు భారీ ఊరటనిచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు, అందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.