చిరంజీవికి విల‌న్‌గా స‌త్య‌దేవ్‌?

వరస విజయాలతో దూసుకుపోతున్న సత్యదేవ్ కు చిరంజీవి సినిమా లూసీఫర్‌లో అదిరిపోయే అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో పాటు 2020లో డిజిటల్ రంగంలో వరస విజయాలు అందుకున్న సత్యదేవ్ ఇప్పుడు చిరు సినిమాలో విల‌న్‌గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. లూసీఫర్ రీమేక్ లో ఈయన విల‌న్‌గా లేదంటే యంగ్ చీఫ్ మినిస్ట‌ర్ పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంలో వివేక్ ఒబేరయ్ నటించిన పాత్రలో ఇక్కడ సత్యదేవ్ కనిపించబోతున్నాడని తెలుస్తుంది. దీనిపై చిత్రయూనిట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించబోతుంది. ఆమెతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కూడా లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు. ఏదేమైనా కూడా చిరంజీవి సినిమాలో అవకాశం రావడంతో సత్యదేవ్ మాత్రం ఎగిరి గంతేస్తున్నాడు.

Leave A Reply

Your email address will not be published.