చిరంజీవి సంకల్పం చాలా గొప్పది..

ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా వేలాది మందికి ప్రాణవాయువు..

మండపేట (CLiC2NEWS): మెగా స్టార్ చిరంజీవి కరోనా రోగులకు ప్రాణవాయువు అందించడానికి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్న ఆయన సంకల్పం చాలా గొప్పది అని జనసేన పార్టీ ఇన్ చార్జి వేగుళ్ల లీలాకృష్ణ, మెగా ఫ్యామిలీ గౌరవ అధ్యక్షుడు అధికారి శ్రీనివాస్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి శెట్టి రవికుమార్ అన్నారు. చిరంజీవి ప్రజల కోసం ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పాలని నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకమైన అంశం అని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ సేవాకార్యక్రమాలకు పెట్టింది పేరు అన్నారు. చిరంజీవి నాడు స్థాపించిన బ్లడ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది అన్నారు. నాటి నేటి వరకూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లక్షలాది మందికి ప్రాణం పోసింది అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా స్థాపించిన ఐ బ్యాంక్ వేలాది మందికి చీకటి తొలగించి వెలుతురు ప్రసాదించింది అన్నారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి అన్నారు. సినీ ఇండస్ట్రీలో అయిన రాష్ట్రంలో గాని ప్రజలకు కష్టం వచ్చిందంటే స్పందించే గొప్ప వ్యక్తి చిరంజీవి అన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటయ్యే ఆక్సిజన్ బ్యాంక్ లు వల్ల ఇక రాష్ట్రం లో ఆక్సిజన్ కొరత ఉండదని అన్నారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చిరంజీవి చేపట్టిన బృహత్తర కార్యక్రమం వేలాది మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఏ ఒక్కరూ ఆక్సిజన్ అందక చనిపోకూడదు అన్నదే చిరంజీవి ఆశయం అన్నారు.

హ‌ర్షం వ్య‌క్తం చేసిన మెగా ఫ్యామిలీ అధ్య‌క్షుడు

ఆక్సిజన్ బ్యాంక్ లు నెలకొల్పాలని మెగాస్టార్ చిరంజీవి తీసుకున్న నిర్ణయం పట్ల మెగా ఫ్యామిలీ అధ్యక్షుడు కొంతం నాగేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. రెండవ దశ కరోనా విజృంభణలో ఎంతో మందికి ఊపిరి అందక చనిపోతుండటం తట్టుకోలేక చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రేపో మాపో జిల్లాస్థాయిల్లో అందుబాటులోకి రాబోయే ఆక్సిజన్ బ్యాంక్ లు వల్ల కరోనా బాధితులకు అందరికీ ప్రాణ వాయువు తేలికగా అందుతుంది అన్నారు.

(త‌ప్ప‌క‌చ‌ద‌వండి: ఆక్సిజన్‌ బ్యాంకుల ఏర్పాటుకు చిరంజీవి నిర్ణయం)
Leave A Reply

Your email address will not be published.