చిరుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోహ‌న్‌బాబు

నిన్న‌ అంద‌రూ వినాయ‌క చ‌వితిని ఇళ్ల‌ల్లో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. అయితే సినీ అభిమాను, ప్రేమికులు మాత్రం చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీ నుండే కాదు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చిరంజీవికి సోష‌ల్ మీడియా ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు త‌న ఆప్త‌మిత్రుడు చిరంజీవికి బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఆ విష‌యాన్ని చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశారు. “నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బ‌హుమానానికి ధ‌న్య‌వాదాలు” అని ట్వీట్ చేశారు. మెసేజ్‌తో పాటు మోహ‌న్‌బాబు పంపిన గిఫ్ట్‌ను ఫొటోను కూడా షేర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.