చిరు, మహేష్ చెరో కోటి విరాళం

హైదరాబాద్ః గత వారం రోజులన నుండి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ఇప్పటికి ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. పలువురు ముంపు బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కెసిఆర్ సర్కార్ తక్షణ సాయంగా రూ. 550 కోట్లు విడుదల చేసింది. బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా పిలుపునిచ్చారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు సంస్థలు, ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు పలువురు ముందుకు వస్తున్నారు.
The unprecedented rains in Hyd have caused massive devastation,loss of lives & extreme hardship to thousands. My heart goes out to those affected by nature’s fury.I’m humbly donating Rs.1Cr to CM Relief Fund.Also appeal 2 all who can to come frward & help the needy @TelanganaCMO pic.twitter.com/ARBeV9JShy
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 20, 2020
The devastation caused by the unprecedented rainfall in Telangana is far worse than we ever imagined. Appreciate the efforts of the Telangana government and the Disaster Response Force for doing their best to help the affected families.
— Mahesh Babu (@urstrulyMahesh) October 20, 2020
ఈ నేపథ్యంలో సిఎం పిలుపు మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీనుండి పలువురు స్పందించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, సూపర్‌స్టార్ మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. అలాగే యువసామ్రాట్ అక్కినేని నాగార్జున రూ. 50 లక్షలు, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, యువ నటుడు విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, దర్శకులు హరీష్ శంకర్, అనీల్ రావిపూడి చెరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. మరికొంత మంది సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతకుముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇప్పటికే తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వం చేసే సహాయక చర్యలకు తోడ్పడేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది.
Heavy rains and floods have devastated the life of people in Hyderabad. Appreciate the efforts of Telangana Govt in releasing 550 crores for immediate relief. Standing by the cause, will contribute 50 lakhs to Telangana CM relief fund.#TelanganaCMO 🙏
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 20, 2020
We came together for Kerala
We came together for Chennai
We came together for the Army
We came together in huge numbers for each other during Corona
This time our city and our people need a helping hand..#HyderabadRains pic.twitter.com/pahnuNTXfi— Vijay Deverakonda (@TheDeverakonda) October 20, 2020
Am Sure we can’t reverse the loss that happened to Hyderabad but I would like to be of help in a little way ….will be happy …
Am contributing Rs. 5 lakhs to support the flood affacted people of Hyderabad. @TelanganaCMO— Harish Shankar .S (@harish2you) October 20, 2020
The city I live in is suffering in front my eyes due to unprecedented rains. My heart felt thanks to the front line relief workers who are striving to resuce our Hyderabad. I wish to come forward and contribute an amount of Rs. 5 lakhs towards the relief measures. @TelanganaCMO
— Anil Ravipudi (@AnilRavipudi) October 20, 2020