చిరు స‌ర్‌ప్రైజ్: ఆనందంలో తేలిపోతున్న‌ ఉప్పెన హీరోయిన్

ప్ర‌పంచవ్యాప్తంగా 70కోట్ల‌కు పైగా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా ఉప్పెన రికార్డుల‌ను సృష్టిస్తోంది. దీనిపై టాలీవుడ్ పెద్ద‌లు ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చిత్రం డైరెక్ట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, హీరోతో పాటు హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టంది. అయితే మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంలోని ప్ర‌తి ఒక్క‌రిని అభినందించ‌డ‌మే కాదు వారికి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌లు పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఉప్పెన చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో చిత్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ ప్రసాద్‌కు లేఖ‌తో పాటు గిఫ్ట్‌ను పంపించారు చిరంజీవి. ఈ విష‌యాన్ని దేవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు.

అలాగే ఉప్పెన‌ హీరోయిన్ కృతి శెట్టికు కూడా చిరు లేఖ పంపారు. ఆ లేఖ‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేసింది ఈ అమ్మ‌డు. ఈ లేఖ‌లో చిరు కృతిని గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.
“ పువ్వు పుట్ట‌గానే ప‌రిమ‌ళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహ‌ర‌ణ‌. స్టార్ కావ‌డం కోస‌మే నువ్వు పుట్టావు. బేబ‌మ్మ పాత్రను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటారు. మంచి విజ‌యాల‌ను సాధించ‌కుంటూ ఇలానే ముందుకు సాగిపో“ అని చిరంజీవి లేఖ‌లో పేర్కొన్నారు.

చిరు లేఖ‌పై స్పందించిన కృతి శెట్టి.. చిరు సార్ చాలా ధన్యవాదాలు.. ఇది నిజంగా నా హృదయాన్ని తాకాయి. అందమైన బహుమతి, మీ బంగారు మాటలు నా హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. మీ ఆశీర్వాదాలను అందుకున్నందుకు నేను చాలా ఆనందంలో తేలిపోతున్నా“ అని కృతి ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

Leave A Reply

Your email address will not be published.