చెత్తతో సంపద సృష్టిచడం మంచి ప‌రిణామం : మ‌ంత్రి కెటిఆర్‌

హైద‌రాబాద్: జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్, మంత్రి మ‌ల్లారెడ్డితో క‌లిసి శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. రూ. 10 కోట్ల‌తో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను బ‌ల్దియా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే పెద్ద ప్లాంట్‌ అని అన్నారు. ఎల్బీనగర్ ఫతుల్ గూడలో సంక్రాంతి రోజున మరో ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో రోజుకు 2వేల టన్నుల భవన నిర్మణా వ్యర్థాలు వస్తున్నాయని, చెత్త నుంచి సంపద సృష్టించడం మంచి కాన్సెప్ట్ అని మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే మరో రెండు ప్లాంట్లను కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. మున్సిపల్ వెస్ట్ మేనేజ్‌మెంట్‌లో జీహెచ్‌ఎంసీ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.
కాగా ద‌క్షిణ భార‌త‌దేశంలోనే ఇది అతిపెద్ద ప్లాంట్ అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దేశంలో ఇది ఐదో ప్లాంట్ అని తెలిపారు. అత్యాధునిక టెక్నాల‌జీతో దీన్ని నిర్మించారు. ఈ ప్లాంట్ ప‌రిస‌రాల్లో ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. సాలిడ్ వేస్ట్ విష‌యంలో జీహెచ్ఎంసీ చాలా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ప్ర‌తి మున్సిపాలిటీలో మానవ వ్య‌ర్థాల‌ను శుద్ధి చేసే ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ వ్య‌ర్థాల వ‌ల్ల‌ ప్ర‌జ‌ల‌కు, ప‌ర్యావ‌ర‌ణానికి హానిక‌రం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.
వ్యర్థాలు ప్రజలకు హానికరంగా మారకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, చెత్త తరలింపునకు 180012007669 టోల్ ఫ్రీ నెంబర్‌ను సం‍ప్రదించాలని కోరారు.

(హైదరాబాద్‌లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు!)

 

 

Leave A Reply

Your email address will not be published.