జాబిల్లిపై సూర్యరశ్మి ప‌డే చోట నీటి జాడలు : నాసా ప్రకటన

వాషింగ్టన్‌ : చ‌ంద్రుడిపై నీటి ఆన‌వాళ్ల‌పై శాస్త్రవేత్త‌లు వేసిన అంచ‌నాలు నిజ‌మేన‌ని తాజా అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. చంద్రునిపై సూర్యరశ్మి తగిలే చోట కూడా నీటి జాడలున్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కనుగొంది. నేచర్‌ ఆస్ట్రానమీ సోమవారం దీనికి సంబంధించిన రెండు అధ్యయనాలను ప్రచురించింది. ఇందులో ఇంతక ముందు ఊహించిన దాని కన్నా చంద్రునిపై ఎక్కువ నీరు ఉండవచ్చునని పేర్కొంది. నాసాకు చెందిన స్ట్రాటోస్పియరిక్‌ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ఫ్రారరెడ్‌ అస్ట్రోనమీ (సోఫియా) అబ్జర్వేటరీ ద్వారా ఈ కొత్త ఆవిష్కారం జరిగింది. ఈ విషయాన్ని నాసా ట్విట్టర్‌ ద్వారా పంచుకొంది. భవిష్యత్‌ అంతరిక్ష ప్రయోగాల చేపట్టే సమయంలో వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై రీఫ్రెష్‌మెంట్‌తో పాటు ఇంధనాన్ని కూడా పొందవచ్చునని చెబుతోంది. ఒక దశాబ్దం క్రితం వరకు కూడా చంద్రునిపై పొడి వాతావరణం ఉంటుందని నమ్మేవారు..కానీ ఇప్పుడు చంద్రునిపై నీటి జాడలు ఉన్నాయని కనుగొన్నారు.

`మా సోఫియా టెలిస్కోప్ సాయంతో చంద్రునిపై సూర్యరశ్మిపడే ఉపరితలంపై మొదటిసారిగా నీటిని కనుగొన్నాము. . పెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే మట్టిలోని గాజు పూసలాంటి నిర్మాణాలలో నీటిని నిల్వ చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.` అని నాసా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.