జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు ప్రారంభించారు. జ్వాలా గుత్తా అకాడమీని రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్వాలా గుత్తాకు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ నిర్వహించిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఎందరో యువ షట్లర్లకు జ్వాలా ప్రేరణగా నిలుస్తుందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం స్పోర్ట్స్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.
Municipal Administration Minister @KTRTRS and Sports Minister @VSrinivasGoud in the presence of Badminton Star @Guttajwala lit the ceremonial lamp and formally launched the Jwala Gutta Academy of Excellence in Moinabad. pic.twitter.com/0DaeXjpOsY
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 2, 2020