టర్కీలో భారీ భూకంపం..

అంకారా: టర్కీలోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అలలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. సునామీ భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. సముద్రంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్టు డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ అథారిటీ ఒక ట్వీట్లో పేర్కొంది. ఇజ్మీర్‌లో తీవ్రమైన భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ తీవ్రతకు ఒక్క బేరాక్లి జిల్లాలోనే 10 భవంతులు పేకమేడల్లా కుప్పకూలాయి.
ప్రకంపనల తీవ్రతకు అజ్మిర్ నగరంలోని పలు భవనాలు కూలిపోయినట్లు తెలుస్తోంది. పలు వీధుల్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూకంపం కారణంగా సముద్రంలో స్వల్ప సునామీ సంభవించి వీధుల్లోకి నీరు చేరింది. ఏజియన్ సముద్రంలో 16.5 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం నిక్షిప్తమైనట్లు టర్కీ అత్యవసర విపత్తు స్పందనా దళం తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికి కోసం అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు.
BREAKING: A #tsunami warning has been issued after an #earthquake with a magnitude of up to 7.0 struck #Turkey‘s #Aegean coast, north of the Greek island of #Samos. Vision has emerged of what’s reportedly tsunami-related flooding in #Seferihisar, south-west of #Izmir #deprem pic.twitter.com/EP9JGDHwkZ
— Auskar Surbakti (@AuskarSurbakti) October 30, 2020