టాలీవుడ్లో కరోనా కలకలం.. మరో డైరెక్టర్‌కు పాజిటివ్
టాలీవుడ్‌ను కరోనా వైరస్ కలవరపెడుతుంది. ఇప్పటికే మెగా కుటుంబంలో వరుణ్ తేజ్, రామ్ చరణ్ లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ ఇద్దరూ క్వారంటైన్ కు పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో చాలా మందికి కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు ఈ వైరస్ ఏం చేయదులే అనుకుంటున్న ప్రతీసారి నేనున్నానని గుర్తు చేస్తుంది కరోనా. తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కు కూడా కరోనా వచ్చింది. రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ల పార్టీలో క్రిష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే క్రిష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్.. జనవరి 4నుంచి షూటింగ్ కు ప్లాన్ చేసాడు. షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది అంతా చేయించుకున్న కరోనా టెస్టులలో క్రిష్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో షూటింగ్ కాన్సిల్ చేసేశాడు నిర్మాత ఏ ఎం రత్నం.