టిఎస్ హైకోర్టు ఆదేశాల‌ను స‌వ‌రించిన సుప్రీం

తెలంగాణలో బాణసంచాపై నిషేధం ఎత్తివేత

న్యూఢిల్లీ: బాణాసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌వ‌ర్క్స్ డీల‌ర్స్ అసోసియేష‌న్‌కు స్వ‌ల్ప ఊర‌ట ల‌భించింది. తెలంగాణలో బాణాసంచా పై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు క్రాకర్స్ విషయంలో ఇచ్చిన తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి హైదరాబాద్లో అసలు ఎటువంటి బాణాసంచా అమ్మకానికి గాని కాల్చయడానికి గాని అనుమతులు లేవంటూ ఎవరైనా షాపులు పెడితే కేసులు నమోదు చేయాలని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు మొన్న తీరుపు చెప్పింది. అయితే ఈ విషయం ముందే చెప్పి ఉంటే తాము కోట్ల రూపాయల సరుకు ముందే కొన్ని ఉండేవాళ్ళం కాదని ఇప్పుడు నిషేధం విధిస్తే ఆ సరుకంతా ఎక్కడ పెట్టాలో తెలియదని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదని చెబుతూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది.

ఈ మేరకు తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జీటీ తీర్పునకు లోబడి హైకోర్టు ఆదేశాలు ఉండాలని పేర్కొంది. ఇక వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాలు పట్టణాల్లో బాణాసంచ పూర్తిగా నిషేధించాలని ఎన్జీటీ పేర్కొంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరాల్లో ప్రస్తుతానికి టపాసులు పూర్తిగా నిషేధం ఉండడం ఉండగా గాలి నాణ్యత పర్లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కి అనుమతి లభించింది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్లగొండ, పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతాల్లో గాలి నాణ్యత తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతాల్లో మాత్రం నిషేధం కొనసాగుతోంది. ఇక తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకొవచ్చని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
గాలి నాణ్య‌త సాధార‌ణ స్థితిలో ఉంటే అలాంటి ప్రాంతాల్లో రాత్రి 8 గంంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ట‌పాసులు కాల్చుకునేందుకు ఎన్జీటీ అనుమ‌తించింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వ‌రిస్తూ ఎన్జీటి ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేయాల‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది.
ఇక ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.