టి.వేదాంత సూరి: ఈ సమాజంలో మంచి మార్పు రాదా ?

అవును ఎన్ని సార్లు ఆలోచించినా అంతుచిక్కని ప్రశ్న వేధిస్తోంది.. ఈ సమాజంలో మంచి మార్పు చూడలేమా? ఎక్కడ చూసినా అవినీతి, పక్షపాతం, విలయ తాండవం చేస్తుంది.. నిజాయితీ రోజు రోజుకు అడుగంటుకు పోతోంది. వ్యవస్థ పూర్తిగా విష తుల్యమైపోయింది. ప్రజా ప్రతినిధులుగా వుండే రాజకీయ నాయకుల్లో పూర్తిగా స్వార్థ చింతన పెరిగి డబ్బు కోసం ఆరాట పడుతున్నారు.. అక్కడ ప్రారంభమై సమాజంలో ఇందు కలదు అందు లేదన్న విధంగా డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని, నిజాయితీని తాకట్టు పెడుతున్నారు.. ఒక పాఠశాలలో చదువుకోవడానికి అంత డబ్బు అవసరమా? ఇక వారు విద్యార్థులకు ఏ హితబోధ చేస్తారు.. ఒక ఆసుపత్రికి వెళ్ళితే రక రకాల వాద్య పరీక్షలు చేసి, జబ్బు ఏమిటో తేలుతుకోకుండానే మందులు ఇచ్చే వైద్యులు పెరిగారు. తమకు న్యాయం చేయమని అడగడానికి కోర్ట్ మెట్లు ఎక్కితే అక్కడ న్యాయవాదులు, న్యాయ మూర్తులు అన్యాయం వైపే మొగ్గు చూపుతున్నారు.. ఒక్కో కేసును దశాబ్దాల తరబడి నాన్చుతున్నారు..

మందులు కల్తీ, తిను బండారాలు కల్తీ. ఏ కార్యాలయానికి వెళ్లినా అవినీతి.. పత్రికలు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా. పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి.. కేవలం వ్యాపారం కోసం డబ్బు కోసం వెనకా, ముందు చూడకుండా ప్రపంచ మంతా ప్రాణాలను విషతుల్యం చేసే వైరస్ ను పంపారు.. ఎవరిని నిందించాలి.. పైగా ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ఒక సాధారణ పౌరుడికి అంతటా అయోమయం, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మ కూడదు. ఏది సత్యం, ఏది అసత్యం. వ్యక్తికీ వ్యకి మధ్య సయోధ్య సన్నగిల్లింది, రావాలి సాధారణ పౌరుడికి మంచి జరగాలి. మంచి భవిష్యత్తు అందాలి.. పరుల కోసం సహాయ పడాలన్న మార్పు మనిషిలో రావాలి. అంటే అందరిలో డబ్బుపై వ్యామోహం తగ్గాలి.. అంత వరకు పరిస్థితిలో మార్పు రాదు.. ఈ వ్యవస్థలో సమూల మార్పు రావలసిన అవసరం వుంది.. చూడాలి.. అందుకోసం ఎన్నాళ్ళు వేచి చూడ వలసి వస్తుందో?

Leave A Reply

Your email address will not be published.