టి. వేదాంత సూరి : పివి, బాలు ఇద్ద‌రూ ఇద్ద‌రే!

అవును వారిద్దరూ తెలుగు వారే.. యావత్ ప్రపంచం వారి ప్రతిభను గుర్తించి అక్కున చేర్చుకుంది.. కానీ తెలుగు వారే వారికి సరైన గౌరవం ఇవ్వలేక పోయారు.. ఎందుకో మరి.. ఒకరు మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహా రావు, మరొకరు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.. ఇద్దరూ తెలుగు వారైనా ఒకరు ఢిల్లీని మరొకరు చెన్నై ని తమ కర్మ భూమిగా ఎంచుకున్నారు. పి.వి. 17 భాషల్లో నిష్ణాతుడు.. బాలు 16 భాషల్లో పాటలు పాడారు.. అంటే ఇద్దరూ బహుభాషా కోవిదులే. మరి వారి విద్వత్తుకు తగిన గౌరవం వచ్చిందా అంటే లేదనే చెప్పాలి.. ఎందుకు.. ఈ డబ్బు.. రాజకీయాలు.. ప్రతిభను గౌరవించి సముచిత స్థానం కల్పిచలేక పోతున్నాం అని మన గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలి..

 

 

పి.వి.ని స్పానిష్, జెర్మనీ ఇంగ్లీష్, హిందీ భాషల వాళ్ళు తమ వారీగా చూసుకున్నారు.. భారత విదేశాంగ శాఖా మంత్రిగా వున్నప్పుడు ఎన్నో సమస్యలకు చాకచక్యంతో పరిష్కరించారు.. బాలుకు తమిళనాడు ప్రభుత్వం ద్వారా పద్మ అవార్డులు లభించాయి.. ఇప్పటికైనా బెంగాలీల లాగ, తమిళుల లాగ తెలుగు వారు భాషా ప్రేమికులుగా మారాలి.. ఇన్ని భాషలు వచ్చినా పి వి. తెలంగాణ యాసలో కథలు రాశారు.. ఈ తరం యువతకు, బాలలకు బాలు భాషాదోషాలు ఉచ్ఛారణా దోషాలు విడమరిచి చెప్పేవారు.. వారు తమ భాషకు తాము గౌరవించుకున్నారు. కానీ మనమే వారిని అర్థం చేసుకోలేక పోయాం. తగిన విధంగా గౌరవించుకో లేకపోయాం. ఇప్పటికైనా మన ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి.. ఒకరి ప్రతిభను గౌరవించి ప్రోత్సహిస్తే మనపై అభిమానం మరింత రెట్టింపు అవుతుంది. ఈర్ష్య నుంచి బయట పడాలి. గొప్పగా ఆలోచించడం నేర్చుకోవాలి.. ప్రతిభకు పట్టం కట్టే అలవాటు చేసుకోవాలి. ఆ రచేతిని అడ్డు పెట్టి సూర్యోదయం ఆపలేరు కదా. మనం సముచిత గౌరవం ఇవ్వకున్నా ఈ ఇద్దరి ప్రతిభ నలుదిశలా చాటుకున్నారు.. అదే మనం కొంత ఉదాతంగా ఆలోచిస్తే వారికి కొంత తృప్తి ఉండేది కదా. వారెప్ప్పుడు అపార్థం చేసుకోలేదు.. మన గురించే ఆలోచించారు.. మనకు పేరు ప్రతిష్టలు సంపాదించారు.. ఇప్పటికైనా అందరూ ఏకతాటిపై నిలిచి వారికీ భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుందాం. ఆలోచించండి ఒక్క సారి..

2 Comments
  1. సుజాత పి.వి.ఎల్. says

    అవును..అక్షరాల నిజం.

  2. Varigonda kasi visweswara rao says

    ఔను. వాళ్లిద్దరూ భారత రత్నా లే !

Leave A Reply

Your email address will not be published.