టి.వేదాంత సూరి: ప్రపంచ వెండి తెరపై ఒక మెరుపు సంతోష్

ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు. అవకాశం వస్తే నిరూపించుకునే సమయం కోసం నిరీక్షిస్తుంటారు. ఈ నేపధ్యం లో హైదరాబాద్ కు చెందిన సంతోష్ తుక్కాపురం ఇప్పుడు విదేశీ గడ్డపై తన ప్రతిభను చాటుకుంటున్నాడు. హైదరాబాద్ మలక్ పేట కు చెందిన సంతోష్ చిన్నప్పటి నుంచి సినిమాపై , నటనపై వ్యామోహం, నిజాం కాలేజీ లో బి. కామ్ చేసారు. సినిమా నిర్మాణం లో దర్శకత్వం లో శిక్షణ పొందారు. చాలా టి. వి. డాక్యూమెంటరీ లు నిర్మించారు. ఆ తరువాత సంతోష్ న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ కు చేరుకున్నాడు.

ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. స్థానికంగా వుండే ఒక టి. వి. లో పని చేస్తున్నారు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాగానే సంతోష్ నిర్మించిన హిందీ చిత్రం ఏక్ గల్తీ ( ఒక తప్పిదం) ఆక్లాండ్ లో విడుదలై బహుళ జనాదరణ పొందింది. ఆ తరువాత ఇప్పుడు మరో హిందీ చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు తానే ద‌ర్శ‌కత్వ బాధ్యతలు చేపట్టారు. ఇది 2021 లో ప్రపంచ వ్యాప్త సినిమా థియేటర్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ పక్కా లోకల్ అయినా సంతోష్ భవిష్యత్తులో మరెన్నో సాధించాలని కోరుకుందాం.

-టి.వేదాంత సూరి

 

Leave A Reply

Your email address will not be published.