టీమ్ ఇండియా అద్వితీయ గెలుపు
చెన్నై: చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా అద్వితీయ విజయం సాధించింది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సుదీర్ఘ ఫార్మట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటయింది.
ఇదే స్టేడియంలో తొలి టెస్ట్‌లో ఎదురైన దారుణ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్‌ను తిప్పేసిన టీమిండియా స్పిన్నర్లు.. 317 పరుగుల భారీ విజయాన్ని కట్టబెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 5 వికెట్లు తీయడం విశేషం. అటు అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 329 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయి టెస్టు ఓటమిని చవి చూసింది. 4 టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచిన భారత్, ఇంగ్లండ్ 1-1తో సిరీస్‌ను సమం చేశాయి.