ట్రైనర్‌కు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన ప్రభాస్‌!

హైద‌రాబాద్‌: బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌ జాతీయ‌స్థాయిలో అభిమానులను సంపాదించుక‌న్నారు. అయితే ‘బాహుబలి’ నుంచి ప్రభాస్‌ ఫిట్‌నెస్‌ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ప్రత్యేక ట్రైనర్‌ సహాయంతో వర్కవుట్‌లు చేస్తున్నారు. ప్రభాస్‌ను ఫిట్‌గా తయారు చేస్తున్న ట్రైనర్‌ లక్ష్మణ్‌ రెడ్డి. అతనంటే ప్రభాస్‌కు చాలా అభిమానం. ఆ అభిమానంతో అతనికి ఏకంగా ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. అయితే ఇది మామూలు కారు కాదు రేంజ్‌ రోవర్‌. ఇంత ఖరీదైన గిఫ్ట్‌ను ప్రభాస్‌ తన పర్సనల్‌ ట్రైనర్‌కు ఇవ్వడం ఇప్పడు ఇండిస్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రభాస్‌కు తన చుట్టూ ఉన్న వారికి సరదాగా ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం అలవాటు. అందుకే ఆయనను ప్రేమగా డార్లింగ్‌ అని పిలుస్తుంటారు. కాగా గ‌తంలో మలేషియాలో ఓ డ్రైవర్‌ కార్‌ని ఫైనాన్షియర్‌లు లాక్కెళ్లారని తెలిసి అదే తరహా కారుని కొని అతనికి బహుమతిగా ఇచ్చింది అనుష్క. ఈ విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. ఇదే తరహాలో ప్రభాస్‌ కూడా ఆశ్చర్యం కలిగించేలా ట్రైనర్‌కు ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.