తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి

న్యూఢిల్లీ : ఇండియన్ క్రికెట్ టీమ్ విరాట్ కొహ్లీ తాను తండ్రిని కాబోతున్నట్లు గురువారం ప్రకటించారు. 2021 జనవరిలో తమ ఇంటికి మూడో మనిషిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తన భార్య అనుష్క శర్మ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు వెల్లడించాడు. త్వరలోనే ముగ్గురం కాబోతున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. ”ఇప్పుడిక మేము ముగ్గురం… జనవరి 2021లో రాక” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అనుష్కతో ఉన్న ఫోటోను విరాట్ జతచేశారు. 2017 డిసెంబర్ 11న వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. వేలాది లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు కొహ్లీ, అనుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ప్రస్తుతం ఐపిఎల్ 2020 కోసం యుఎఇకి వెళ్లిన కొహ్లీ అక్కడ క్వారంటైన్‌లో ఉన్నారు. 2017లో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు.
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020