తమన్నా తల్లితండ్రులకు కరోనా

ముంబ‌యి: ప్ర‌ముఖ‌ స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. గత వారంలో తన తల్లిదండ్రులకు జ్వరం, దగ్గు వంటి చిన్నపాటి లక్షణాలు కనిపించాయని, దీంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నామని చెప్పారు. ఇంట్లో మిగిలిన వారికి కానీ, తనకు కానీ కరోనా లక్షణాలు లేవని, అయినా పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తేలిందని పేర్కొన్నారు.
బుధవారం ఆమె త‌న ఖాతాలో ‘‘అమ్మానాన్నలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇంట్లో ఉన్న వారందరమూ కోవిడ్‌ టెస్టులు చేయించుకున్నాం. దురదృష్టవశాత్తు మా తల్లిదండ్రులకు పాజిటివ్‌ వచ్చింది. కానీ, నాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరికి నెగిటివ్‌ వచ్చింది. భగవంతుడి దయ వల్ల వారు బాగానే ఉన్నారు. మీ ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలతో వారు కోలుకోవాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమన్నా పోస్టుపై స్టార్‌ హీరోయిన్లు సమంత, కాజల్‌ స్పందించారు. ఆంటీ, అంకుల్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.