తిరుమల వేద పాఠశాలలో 50 మంది విద్యార్థులకు కరోనా

తిరుమల: ఎపిలోని తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో 50 మంది వేద పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. దీంతో విద్యార్థులను తిరుపతి పద్మావతి కొవిడ్ కేంద్రానికి తరలించారు. గతంలోనూ ఈ వేద పాఠవాలలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా వేద పాఠశాలలో ఒకేసారి 50 మంది విద్యార్థులకు వైరస్ బారినపడడంతో స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతుండడతో కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ పాజిటివ్‌గా అని తేలింది.