తెలంగాణలో కొత్తగా 1,078 కొవిడ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యధిలో కొత్తగా 1,078 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. మహమ్మారి ప్రభావంతో తాజాగా మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తాజా మృతులతో కలిపి రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,712కు చేరింది. తాజాగా 331 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6900 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులు అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే 283 ఉన్నాయి. రంగారెడ్డిలో 104, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 113, నిజామాబాద్‌లో 75, సంగారెడ్డిలో 46, జగిత్యాలలో 40, నిర్మల్‌లో 40, కరీంనగర్‌లో 34 కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం ఒకే రోజు 59,705 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.