తెలంగాణలో కొత్తగా 509 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 48,652 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 509 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2,79,644కి చేరాయి. కొత్తగా 517 మహమ్మారి నుంచి కోలుకోగా.. 2,70,967 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 5,063 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ మేర‌కు గురువారం ఉద‌యం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వైరస్‌ బారినపడి కొత్తగా ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1505కు పెరిగింది. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 96.89శాతంగా ఉందని చెప్పింది. బుధవారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 48,652 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం 63,06,397 పరీక్షలు చేసినట్లు తెలిపింది. పదిలక్షల జనాభాకు 1,69,435 మందికి టెస్టులు చేస్తున్నామని ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 104, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 45, రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు రికార్డయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.