తెలంగాణలో బాణాసంచా అమ్మకాలపై నిషేధం

ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు 

హైదరాబాద్‌ : దీపావ‌ళి సంద‌ర్భంగా తెలంగాణలో బాణాసంచా విక్రయాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్‌ చేసింది. ఈ మేరకు పటాకుల నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా మహమ్మారి వేళ పటాకులు కాల్చిస్తే వాటిని నుంచి వచ్చే విష వాయువులతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ, రాజస్థాన్‌, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, హర్యానాతో పాటు పలు రాష్ట్రాలు పటాకుల అమ్మకాలు, విక్రయాలపై బ్యాన్‌ విధించాయి. మహారాష్ట్రలో బాణాసంచాపై బ్యాన్‌ విధించకపోయినా.. వాటికి దూరంగా ఉండాలని సూచించింది. పశ్చిమ బెంగాల్‌లోనూ కాళీమాత పూజ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు విక్రయాలపై, కాల్చడాన్ని నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను గుర్తించేందుకు పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నియంత్రణ మండలి (డబ్ల్యూబీపీసీబీ) రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు వెయ్యి వరకు జీపీఎస్‌ అమర్చిన సౌండ్ మానిటరింగ్ పరికరాలను పంపిణీ చేసింది.

ఈ క్రమంలో తెలంగాణలో కూడా క్రాకర్లు బ్యాన్ చేయాలన్న తెలిపింది.  ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హై కోర్టు ఎవ్వరూ క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని కోరింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలన్న  హైకోర్టు ఈ నెల 19న ఈ ఆదేశాలకి సంబంధించి ఎలాంటి చర్యలు  తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రచార మాధ్యమాల ద్వారా  క్రాకర్స్  కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు పేర్కొంది.

 

Leave A Reply

Your email address will not be published.