తెలంగాణలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రెండు వేలకు చేరువలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1914 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. తాజాగా 285 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,03,298 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1734కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,617 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.