తెలంగాణ‌కు త‌మిళ‌ స‌ర్కార్‌ రూ.10 కోట్ల విరాళం

హైద‌రాబాద్: ఈ మ‌ధ్య కురిసిన భారీ వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ అత‌లాకుత‌లం అయిన విష‌యం తెలిసిందే.. అయితే ఈ వ‌ర‌ద బాధితుల కోసం త‌మిళ‌నాడు సీఎం రూ. 10 కోట్లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప‌ళ‌నిస్వామికి మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలంగాణ‌కు అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని సీఎం ప‌ళ‌నిస్వామి ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. కాగా త‌క్ష‌ణ సాయం కింద రూ. 1,350 కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు అన్నారు. వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. ప్ర‌జాప్ర‌తినిధులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాల‌ని మంత్రి కెటిఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 33 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 29 మందికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సాయం అందించామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. మీడియా కూడా ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాల‌ని ఈ సంద‌ర్భంగా కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.