ద‌క్షిణ‌ భారత నటి టి.ఆర్.రాజకుమారి

ద‌క్షిణాది చిత్రపరిశ్రమలో ‘డ్రిమ్ గర్ల్’ అనిపించుకున్న అందిలతార రాజకుమారి.మనహర నాటకం ఆనాడు విరివిగా తెలుగునేలపై ప్రదర్శింపబడుతుండేది. అందులో వసంతసేనగా గరికపాటి వరలక్ష్శి నటించేది.
ఈ నాటకాన్ని ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనోహర’ (1954) శివాజిగణేషన్, కన్నాంబా, దాసరి సదాశివరివు తదితరులు నటించిన ఈ చిత్రంలో అద్బుతంగా వసంతసేన పాత్రకు జీవం పోసారు రాజకుమారి.


1922 లో జన్మించిన ఈమె పూర్తి పేరు తంజావూరు రంగనాయకి రాజకుమారి. ఈమె పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళనటి) రాజకుమారిని  సినిమారంగానికి పరిచయంచేసింది. ఈమె మొదటి సినిమా ‘కుమార కుళోత్తుంగన్’ (1941)  ‘కచదేవయాని’ చిత్రంతో తారాపథానికి వెళ్ళింది. ‘మంత్రవాది’  ‘సూర్యపుత్రి’ ‘మనోన్మణి’  ‘హరిదాస్’  ‘కృష్ణభక్తి’ చిత్రాలలో నటించి నాటి కుర్రకార్లకు కలలరాణిగా వెలిగింది ఈమె.

1948 జమిని వారు నిర్మించిన భారీచిత్రం ‘చంద్రలేఖ’ చిత్రంలో ఈమె కథానాయకి. ఈ చిత్రం  తమిళ- తెలుగు నేలపై ర‌జ‌తోత్సవం జరుపుకుంది.

ఈమె అక్కగారు. నటీమణినే. ఆ అక్క కూతురు ప్రముఖ సినీ నర్తకి కుచలకుమారి. ఈమె సోదరుడు చక్రపాణి తమిళ నిర్మాత. మరోసోదరుడు సినిదర్శకుడు టి.ఆర్.రామన్న వీరిభార్యలు ప్రముఖ సినీ నటీమణులు ఇ.వి.సరోజ-బి.ఎస్.సరోజలు. రాజకుమారి చెల్లెలికూతుర్లే జ్యోతిలక్ష్మి-జయమాలినీలు.

మద్రాసు పాండీబజార్ లొ  ‘రాజకుమారి టాకీస్’ అని ఓసినిమా హలు నిర్మించింది.నేడు అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నేటికి ఆబస్ స్టాప్ పేరు రాజకుమారి ధియోటర్ గానే పిలుస్తారు. మద్రాసు మౌట్ రోడ్డులో వీరికి పెట్రోలు బంక్ కూడ ఉండేది.


అసమాన నటనా ప్రతిభ అందము కలిగిన రాజకుమారికి చివరిరోజుల్లో భయంకరమైన చర్మ వ్యాధి సోకి తనరూపం కోల్పోయింది. తన యింటికి వచ్చిన వారితో తెరచాటున ఉండి మాట్లాడేవారు. ఈమె రూపంలో రాజసం, దర్పం, హొయలు, కవ్వించేకళ్ళు, పదే పదే చూడాలి అనిపించే స్పురద్రూపం కలిగిన ఈ అందాలరాశి తక్కువ చిత్రాలలో న‌టించి ఎక్కువ పేరు పొంది 1999/సెప్టెంబర్ /20 వ తేదిన శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు.

‍‍‍-డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వరరావు

Leave A Reply

Your email address will not be published.