దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి

హైదరాబాద్ :దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిర్మితమవుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన 754.38 మీటర్ల పొడవైన త్వరలోనే అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ఈ తీగల వంతెన అందాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి త్వరలోనే ప్రారంభం కానుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఈ వీడియోను షేర్ చేశారు. దుర్గం చెరువుపై నిర్మించిన ఈ హ్యాంగింగ్ బ్రిడ్జి త్వరలో ప్రారంభం కానుందని, రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనే ముఖ్యమైన అంశంమని కెటిఆర్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 60 శాతానికి పైగా నిధులు కేటాయించిందని, వంతెనను నిర్మించినందుకు ఇంజనీర్లకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా, 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని రూ. 184 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ తీగల వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది.
A sneak peek of the very soon to be unveiled cable stay bridge on Durgam Cheruvu 😊
Infrastructure is the key to growth & #Telangana Govt spends over 60% budget on infra creation
Great job engineering team 👍@GHMCOnline @bonthurammohan @arvindkumar_ias #HappeningHyderabad pic.twitter.com/CvHwwk4l6X
— KTR (@KTRTRS) September 2, 2020