దేశంలో కొత్త‌గా 1.26 లక్షల క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజు వారీ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తున్నది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,26,789 కొవిడ్‌ కేసులు.. 685 మరణాలు నమోదయ్యాయి. ఈ మేర‌కు గురువారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,29,28,574కు పెరగాయి. మృతుల సంఖ్య 1,66,862కు చేరింది.

కొత్తగా 59,258 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా డిశ్చార్జిల‌తో క‌లిపి దేశంలో మొత్తం 1,18,51,393 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,10,319కు చేరాయని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.