దేశంలో క‌రోనా కల్లోలం.. 714 మరణాలు

న్యూఢిల్లీ:  దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఒక‌వైపు మ‌హ‌మ్మారి కట్టడికి కోసం ప్ర‌భుత్వాలు వ్యాక్సిన్ వేస్తున్నా… దేశంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

తాజా కేసుల‌తో క‌లిపి భార‌త్‌లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది.  ఇందులో 1,15,69,241 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 6,58,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 44,202 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు అధికారులు వెల్ల‌డించారు. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 714 మంది మృతి చెందారు. తాజా కేసుల‌తో క‌లిపి ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.